VIDEO: విద్యుత్ తీగలు తాకి లారీ డ్రైవర్ మృతి

VIDEO: విద్యుత్ తీగలు తాకి లారీ డ్రైవర్ మృతి

ASF: కాగజ్ నగర్ మండలం చింతగూడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ముత్యంపేట్ నుంచి కంకర లారీని తీసుకొచ్చిన కొట్రంగి రాములు (43) అన్లోడ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. లారీకి పైభాగంలో ఉన్న హైడ్రాలిక్ భాగం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను తాకడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.