'బెట్టింగులకు దూరంగా ఉండండి'
ATP: IPL ప్రారంభమైన సందర్భంగా యువత క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండాలని ఎస్పీ జగదీశ్ కోరారు. బెట్టింగ్ యాప్‌లలో బోనస్‌లు చూసి ప్రలోభ పడోద్దని చెప్పుకొచ్చారు. యువత తక్కువ వ్యవధిలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో బెట్టింగ్ బారిన పడి డబ్బులు పోగొట్టుకుని బజారున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పరువును, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు.