విశాఖ బీచ్ పరిశుభ్రతకు ప్రాధాన్యం

విశాఖ బీచ్ పరిశుభ్రతకు ప్రాధాన్యం

VSP: విశాఖపట్నం బీచ్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఆర్కే బీచ్‌లో సీఎస్‌ఆర్ నిధులతో సమకూర్చిన కొత్త బీచ్ స్వీపింగ్ యంత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ బీచ్‌కు రోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని, వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం బాధ్యత అని అన్నారు.