అదుపుతప్పిన బైక్.. ఇద్దరికి గాయాలు
ELR: దెందులూరు జాతీయ రహదారిపై ఆదివారం బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు జారి పడ్డారు. అటుగా వెళుతున్న జడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తన కాన్వాయ్‌ను ఆపి వారిని ప్రత్యక్షంగా పరామర్శించారు. గాయపడిన ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సమీప ఆసుపత్రికి తరలించేలా సిబ్బందిని ఆదేశించారు.