ఈనెల 17 నుంచి MGU డిగ్రీ బ్యాక్ లాగ్ పరీక్షలు

ఈనెల 17 నుంచి MGU డిగ్రీ బ్యాక్ లాగ్ పరీక్షలు

NLG: మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలోని డిగ్రీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన 'చివరి అవకాశం' పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా విద్యార్థులందరికీ నల్గొండలోని నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాలను ఏకైక కేంద్రంగా కేటాయించారు. ఈ పరీక్షల కోసం మొత్తం 926 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.