జిల్లాలో యూరియా కొరత లేదు: జేసీ
W.G: జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పంటకు, యూరియాకు సంబంధించి జిల్లాస్థాయిలో 83310 56742 నంబర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.