జిల్లా అభివృద్ధికి CM సహకరిస్తున్నారు: ఎమ్మెల్యే

జిల్లా అభివృద్ధికి CM సహకరిస్తున్నారు: ఎమ్మెల్యే

NGKL: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం ఛైర్మన్ తీగల సునేంద్ర అధ్యక్షతన ఇవాళ నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీలో రోడ్లను రూ. 56 కోట్ల రూపాయలతో పూర్తిచేశామని అన్నారు. అలాగే డ్రైనేజీ పనులకు రూ.40 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. సీఎం సొంత జిల్లా కేంద్రం కావడంతో అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు.