VIDEO: ఆత్మకూరులో భారీ వర్షం
NDL: ఆత్మకూరులో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం పడటంతో పట్టణంలోని రహదారులు, లోతట్టు కాలనీలలో వర్షపునీరు నిలిచి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. పంట పొలాల్లో సైతం నీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో పంటలు నష్టపోయామని వాపోతున్నారు.