సిలిండర్ పేలి మహిళకు తీవ్ర గాయాలు
HYD: చైతన్యపురిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో సిలిండర్ పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలు అయిన ఘటన చైతన్యపురి పరిధిలోని భవానీనగర్‌లో చోటుచేసుకుంది. మహిళ వంట గదిలో ఉండగా.. ఒక్కసారిగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.