10 వేల 5 వందల ఎకరాల్లో పంట నష్టం: RDO

KMR: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, మంజీర నదికి వచ్చిన వరదల కారణంగా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో 10 వేల 5 వందల ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగిందని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ రావుతో కలిసి భారీ వర్షాల కారణంగా నాగిరెడ్డిపేటలోని పటేల్ చెరువు తెగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు.