ఆటోను ఢీ కొట్టిన లారీ
ELR: దెందులూరు మండలం సత్యనారాయణపురం వంతెన సమీపంలో శుక్రవారం కూలీలతో వెళుతున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలకు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు గాయాల పాలయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న హైవే సేఫ్టీ సిబ్బంది ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు.