ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

PDPL: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి అవసరమైన పరికరాల ప్రతిపాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని సూచించారు.