రేవంత్‌పై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం
TG: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. HYDలోని బెంగాలీలతో సమావేశమైన ఆయన.. పాతబస్తీలో రోహింగ్యాలకు అక్రమంగా ఓటర్ కార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్న రేవంత్, పాతబస్తీలో అధికారులపై దాడులు చేస్తున్న మజ్లిస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.