అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

HYD: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దైనట్లు భారతీయ జనతా పార్టీ నేతలు తెలిపారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్ నగరానికి రావాల్సి ఉంది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాల్సి ఉంది. అయితే కొన్ని అత్యవసర కార్యక్రమాల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలిపారు.