'రోడ్డుకు మరమ్మతులు చేయాలి'

'రోడ్డుకు మరమ్మతులు చేయాలి'

KMM: రఘునాథపాలెం మండలం నుంచి ఇల్లెందు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణించేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు మండిపడ్డారు.