సంక్షేమ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

సంక్షేమ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

BPT: బాపట్ల మండలం స్టువర్టుపురం గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలను శనివారం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నందు విద్యార్థులకు సౌకర్యాలు, వారికి అందిస్తున్న ఆహారాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి రుచికరమైన ఆహారం అందిస్తున్నారా లేదా అని ఎమ్మెల్యే ఆరా తీశారు.