VIDEO: కనువిందు చేస్తున్న జలపాతం
NGKL: అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వరం దేవాలయం వద్ద కొండపై జలపాతం కనువిందు చేస్తుంది. తుఫాన్ కారణంగా భారీ వర్షానికి కొండలపై నుంచి జలపాతాలు జాలు వారుతున్నాయి. దేవాలయం వద్దకు వచ్చే భక్తులకు జలపాతం ఎంతగానో కనువిందు చేస్తుంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఈ జలపాతం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుందని స్థానికులు తెలిపారు.