తైక్వాండ‌లో విశాఖ విద్యార్థుల ప్రతిభ

తైక్వాండ‌లో విశాఖ విద్యార్థుల ప్రతిభ

VSP: చిత్తూరులో జరిగిన ఐదవ అంతర్రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026లో మధురవాడకు చెందిన ఆనంద్ తైక్వాండో అండ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు పలు విభాగాల్లో బంగారు పతకాలు సాధించి విశేషంగా రాణించారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు.