వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొల్లు

కృష్ణా: లిక్కర్ స్కామ్ దర్యాప్తులో నిజాలు బయటికొస్తున్న తరుణంలో వైసీపీ నేతలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లిక్కర్ స్కామ్‌లో తాడేపల్లి ప్యాలెస్‌లో తోడు దొంగలు అడ్డంగా దొరికారని ఎద్దేవా చేశారు. దొరికిన దొంగలను టీడీపీకి అంటగడుతూ తన అనుకూల మీడియాలో జగన్ ఫేక్ ప్రచారం చేసుకుంటున్నాడని మండిపడ్డారు.