రూ.కోటి అప్పు.. 65 మందికి నోటీసులు!
JGL: ఆరవల్లిలో ఒక వ్యాపారి 65 మందికి ఐపీ నోటీసులు పంపారు. గ్రామానికి చెందిన ఓ చిరు వ్యాపారి సుమారు 65 మంది వద్ద నుంచి విడివిడిగా రూ.1.20 కోట్ల వరకు అప్పులు చేశాడు. అప్పు చెల్లించాలని బాధితులు ఒత్తిడి చేయడంతో, తనకు వ్యాపారంలో నష్టం వాటిల్లిందని పేర్కొంటూ అందరికీ కోర్టు ద్వారా ఐపీ నోటీసులు పంపాడు. నోటీసులు రావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.