బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

NRML: పెంబి మండలంలోని గుమ్మనా ఎంగ్లాపూర్ లో ఇటీవల పిడుగు పడి మృతి చెందినఎల్లయ్య - లక్ష్మి దంపతుల కుటుంబ సభ్యులను ఆదుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జూ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులను కలిసి రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.