గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు  తెలియని వ్యక్తి మృతి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 17న నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఇతన్ని హుటాహుటిన జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడు చనిపోయే ముందు తనది అచ్చంపేట ప్రాంతం అని తెలిపినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నారు.