సొంతగూటికి చేరిన మాజీ ఉపసర్పంచ్

MBNR: రాజాపూర్ మండలం చోక్కంపేట గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ మంచాల శాంతయ్య బీఆర్ఎస్ పార్టీని వీడి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. కాగా శనివారం శాంతయ్య కాంగ్రెస్ పార్టీని వీడి సొంతగూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ గ్రామ అధ్యక్షులు ఆవుల మంద యాదగిరి, కృష్ణయ్యలు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.