ఉరి వేసుకుని గృహిణి ఆత్మహత్య

ఉరి వేసుకుని గృహిణి ఆత్మహత్య

ASF: కాగజ్‌నగర్‌ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలో తానియా విశ్వాస్ (22) అనే గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె, చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకుంది. మృతురాలి తమ్ముడు వాసుదేవ్ సర్కార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.