మూసీ వాగు, బ్రిడ్జీలను పరిశీలించిన CP

మేడ్చల్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భూదాన్ పోచంపల్లి వద్ద ఉన్న జూలూరు మూసీలో లెవెల్ బ్రిడ్జి, సంగం బ్రిడ్జిలను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.