కోదాడలో విస్తృతంగా పర్యటించనున్న ఎమ్మెల్యే
SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఇవాళ మునగాల, అనంతగిరి, కోదాడ, చిలుకూరు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పల్లె దవాఖానలు, గ్రామ పంచాయతీ భవనాలు, గోడౌన్, ముస్లీం కమ్యూనిటీ హాల్, సజ్దా ప్లాట్‌ఫామ్, పలు 33/11 KV విద్యుత్ సబ్‌స్టేషన్‌లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు MLA క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల అయింది.