వైసీపీ నేత బుల్లెట్ సురేశ్ సస్పెండ్

వైసీపీ నేత బుల్లెట్ సురేశ్ సస్పెండ్

చిత్తూరు జిల్లాలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీజీ సురేశ్ @ బుల్లెట్ సురేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.