నగరంలో 'మార్వాడీ గో బ్యాక్' బ్యానర్లు

నగరంలో 'మార్వాడీ గో బ్యాక్' బ్యానర్లు

KMM: మార్వాడీ గో బ్యాక్' నినాదంతో ఖమ్మం నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. ఓయూ జేఏసీ నాయకుడు కొత్తపల్లి తిరుపతి ఇచ్చిన బంద్ పిలుపునకు మద్దతుగా రైల్వే స్టేషన్, కమాన్ బజార్ సెంటర్లలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ బంద్‌కు వర్తక సంఘాల మద్దతు ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.