అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎంపీ
VZM: పేదల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో అన్న క్యాంటీన్‌లు నిర్మించారు. అందులో భాగంగా కొత్తవలస కూడలిలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను విశాఖ ఎంపీ శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కలెక్టర్ రామ సుందర్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఆనంతరం భోజనం రుచి చూశారు.