రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు
MBNR: భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన నాగరాజు(30) వంతెనపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడి రోడ్డు పక్కనే పడివుండగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.