నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్

నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్

SRD: నాగల్‌గిద్ద మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం మూడో విడత నామినేషన్ ఏర్పాట్లను ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి పరిశీలించారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవోతో కలిసి నామినేషన్ల కౌంటర్ల ఏర్పాట్లు, స్టేజ్ 1, స్టేజ్ 2 ఆఫీసర్లతో మాట్లాడారు. ఈ మేరకు రేపటి నుంచి సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణపై సబ్ కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.