మైదుకూరులో గుర్తుతెలియని శవం కలకలం
KDP: మైదుకూరులోని ప్రొద్దుటూరు రోడ్డులో కేసీ బంగ్లా కెనాల్ వద్ద ఆదివారం గుర్తుతెలియని శవం లభ్యమైంది. పక్కనే పొట్టెలు మృతి చెంది ఉంది. స్థానికులు గమనించి పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. శరీరం బాగా కుళ్లిపోయి ఉండటంతో ఇది హత్యనా? ఆత్మహత్యనా? లేక ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.