గంటల వ్యవధిలో కేసును ఛేదించిన విశాఖ పోలీసులు

గంటల వ్యవధిలో కేసును ఛేదించిన విశాఖ పోలీసులు

VSP: తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి ఇంటిలో శుభకార్యానికి విశాఖ వచ్చాడు. విశాఖ నుంచి చెన్నై వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఎయిర్ పోర్టు వెళ్తూ క్యాబ్‌లో విలువైన వస్తువులు, డబ్బులతో బ్యాగ్ మర్చిపోయాడు. ఈ విషయం సీపీ శంఖబ్రత బాగ్చికి ఫోన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాలతో వెస్ట్ జోన్ క్రైమ్ పోలీసులు కొన్ని గంటల వ్యవధిలో ఆ బ్యాగ్‌ను కనిపెట్టారు.