తడి పొడి చెత్త పై అవగాహన: కమిషనర్

KDP: పులివెందులలోని నగరిగుట్టలో శానిటరీ సెక్రటరీలు ప్రజలకు తడి, పొడి చెత్తలను వేరు చేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ మేరకు కమిషనర్ రాముడు మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తలను వేరుచేసి పురపాలక చెత్త సేకరణ వాహనాలకు అందించాలని ప్రజలకు సూచించారు. కాగా, ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.