రెండు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన

AP: ఈ నెల 29, 30 తేదీల్లో సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా పర్యటనలో పాల్గొననున్నారు. ఈ నెల 30న కుప్పం మం. పరమసముద్రం చెరువు దగ్గర జలహారతి ఇచ్చి అనంతరం సభలో పాల్గొంటారు.