'అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

VSP: సంక్రాంతి నేపథ్యంలో కోడిపందేలు, పేకాట ఆడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆదివారం పీఎంపాలెం సీఐ బాలకృష్ణ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రోజుల్లో జూదం క్రీడలకు ఎటువంటి అనుమతులు లేవని అన్నారు. కోడిపందేలు, పేకాట నిర్వహుకులపై ఇప్పటికే నిఘా ఉంచామని.. అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే 9440796060 నెంబర్‌కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.