'మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదు'
KDP: పులివెందుల ఎంవీఐ ఆఫీసులో ఇవాళ ప్రైవేటు బస్సు డ్రైవర్లు, ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బి. వెంకట ప్రసాద్ మాట్లాడుతూ.. డ్రైవర్ల అందరికి లైసెన్స్ తప్పనిసరి అని, మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు.