BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం

AP: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మైత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, రెండు లారీలు ఢీకొన్నాయి. మొదట బస్సు లారీని ఢీకొట్టగా, వెనుక నుంచి వచ్చిన మరో లారీ.. ఆగిన బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుక కూర్చున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో పది మంది గాయపడగా.. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.