VIDEO: జిల్లాలో స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
KRNL: దేవనకొండలో ఇవాళ స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. దోమల నివారణపై అవగాహన కల్పిస్తూ డిప్యూటీ ఎంపీడీవో గోపాల్, వైద్యాధికారి కళ్యాణ్ ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ, చికెన్ గున్యా నివారణకు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ర్యాలీలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.