ఈనెల 5వ తేదీ నుంచి పగిడిద్దరాజు జాతర ప్రారంభం

ఈనెల 5వ తేదీ నుంచి పగిడిద్దరాజు జాతర ప్రారంభం

BDK: గుండాల మండలం యాపలగడ్డ గ్రామంలో ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ పగిడిద్ద రాజు జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం జాతర ఏర్పాట్లను గిరిజన సేవక సంఘం రాష్ట్ర యువజన నాయకుడు అరేం ప్రశాంత్ పరిశీలించారు. స్థానిక అరేం వంశీయులతో కలిసి పర్యవేక్షించారు. ఈ వేడుకలను గిరిజన ఆదివాసి ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పారు.