ఆన్‌లైన్ వ్యభిచారం.. ఉగాండా మహిళలను రక్షించిన టీం.!
MDCL: రాచకొండ పోలీసుల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), నాచారం పోలీసులతో కలిసి భవానీ నగర్, నాచారంలో దాడి చేసి ఆన్‌లైన్ వ్యభిచారానికి బలవంత పరచబడిన ఇద్దరు ఉగాండా మహిళలను రక్షించింది. ఈ సందర్భంగా 59 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి మోహితే సంపత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు డేనియల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.