VIDEO: శ్రీ నరసింహ ఈరన్న స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వాణి ఆధ్వర్యంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. స్వామివారి హుండీ ఆదాయం రూ. 83,71,517లు వచ్చిందని, బంగారం 55 గ్రాముల 100 మిల్లీ గ్రాములు, వెండి 9 కేజీల 810 గ్రాములు వచ్చినట్లు ఆమె తెలిపారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.