జ్యోతి బాపూలే సేవలు చిరస్మణియం: ఎమ్మెల్యే
E.G: రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామంలోని ఎన్టీఆర్ నగర్ నందు జ్యోతి బాపూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాళులర్పించారు. అనంతరం రూ. 2.67 కోట్లతో నిర్మించనున్న రెండు ఓ.హెచ్.ఆర్ వాటర్ ట్యాంకులకు శంకుస్థాపన చేశారు. జ్యోతి బాపూలే భారత ప్రథమ సామాజికతత్వవేత్త అని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.