‘దేశ ఐక్యతకు ముప్పు కలిగించే పనులకు చెక్ పెట్టాలి’

‘దేశ ఐక్యతకు ముప్పు కలిగించే పనులకు చెక్ పెట్టాలి’

రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా ప్రధాని మోదీ కీలక సందేశం ఇచ్చారు. 'ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఐక్యతతో ప్రమాణం చేశారు. దేశ ఐక్యతను బలంగా చేసే పనులనే ప్రోత్సహిస్తామని మనం నిర్ణయించుకున్నాం' అని మోదీ అన్నారు. 'మన దేశ ఐక్యతను బలహీనపరిచే ప్రతి ఆలోచన లేదా చర్యకు ప్రతి పౌరుడు దూరంగా ఉండాలి. ఈ సమయంలో దేశానికి ఇదే చాలా అవసరం' అని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.