ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలి: ఎస్సై

ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలి: ఎస్సై

BHNG: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిమజ్జనం సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని పోచంపల్లి ఎస్సై భాస్కర్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపలి పురపాలక కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ స్వచ్ఛంద సంఘాల గణేష్ నిర్వాహకులకు అవగాహన సదస్సును నిర్వహించారు.