TTD ఛైర్మన్ కనబడటం లేదని బ్యానర్.. కేసు నమోదు

TTD ఛైర్మన్ కనబడటం లేదని బ్యానర్.. కేసు నమోదు

TPT: TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు కనబడటం లేదని ఏడీ బిల్డింగ్ వద్ద బుధవారం బ్యానర్ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ వీజీవో గిరిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకి చెందిన అజయ్ కుమార్, పసుపులేటి సురేశ్, వాసు యాదవ్, ఉదయ్ వంశీ ఫ్లెక్సీ పెట్టినట్లు అధికారులు గుర్తించారు.