రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి: AO
NRPT: ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి నూతనంగా అర్హత పొందిన రైతులు ఈనెల 25 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి (ఏవో) రహమాన్ సూచించారు. ఫిబ్రవరి చివరి నాటికి భూభారతి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అర్హులైన వారు బ్యాంక్ ఖాతా పుస్తకం, నకళ్లను సంబంధిత రైతు వేదికలో అందజేయాలని కోరారు.