అరుణాచలానికి ప్రత్యేక బస్సు
NZB: కార్తీక మాసం సందర్భంగా నిజామాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు RTC RM జోత్స్న తెలిపారు. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం 3 గం. బస్సు బయలుదేరుతుందన్నారు. తిరిగి 7వ తేదీన తెల్లవారు జామున NZBకు చేరుకుంటుందని చెప్పారు. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, జోగులాంబ, బీచుపల్లి హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చన్నారు.