VIDEO: 700 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం పౌర్ణమి వేడుకలు
NTR: కంచికచర్లలోని సుమారు 700 ఏళ్ల చరిత్ర గల పాత శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. 365 ఒత్తులు వెలిగిస్తే ఏడాది పొడవునా దీపారాధన చేసినట్లేనని ఆలయ అర్చకులు సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా జ్వాలా తోరణం కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అంతా మంచే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.