నేడు సిద్దిపేటలో సీఎం రేవంత్ పర్యటన

నేడు సిద్దిపేటలో సీఎం రేవంత్ పర్యటన

TG: సిద్దిపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా జైలును సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. 415 మంది ఖైదీల వసతి కోసం దీనిని ఏర్పాటు చేశారు. భద్రత కోసం ప్రత్యేకంగా 'స్వస్తిక్ సెల్స్' నిర్మించినట్లు డీజీ తెలిపారు. సమీప జైళ్లలో ఖైదీల రద్దీని తగ్గించేందుకు ఈ హై-సెక్యూరిటీ జైలు కీలకం కానుంది. డీజీ స్వయంగా ఏర్పాట్లను సమీక్షించి, భద్రతా వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేశారు.